పెద్దచెరువును రిజర్వాయర్ గా మార్చడానికి అనుమతి మంజూరు చేసిన చంద్రబాబు : మాగుంట
పొదిలి పెద్దచెరువును రిజర్వాయర్ గా మార్చేందుకు చంద్రబాబు అనుమతులు మంజూరు చేశారని శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు.
ప్రజా ఆశీర్వాద పాదయాత్ర ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మాగుంట మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు నివారణ కొరకు నదులను అనుసంధానం కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు ఇటీవల జిల్లాకు వచ్చిన సమయంలో పొదిలి పెద్దచెరువును రిజర్వాయర్ గా మార్చాలని వినతిపత్రం అందజేయగా పత్రాలను పరిశీలించి అక్కడికక్కడే మంజూరు చేశారని మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు.