రేపటి నుంచి మండలంలో కందుల విస్త్రుత పర్యటన

తొలి రోజు అన్నవరం నుంచి ప్రారంభం

కార్యకర్తల సమావేశం గ్రామ కమిటీలు ఏర్పాటు

ప్రతి వంద ఓటర్లు నుంచి ఒక పసుపు దళ కోఆర్డినేటర్ ఎంపిక

మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి సోమవారం నాటి నుంచి మండలాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు పొదిలి మండలం అన్నవరం గ్రామం నుంచి తొలి రోజు పర్యటన ప్రారంభించి అక్కడ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గ్రామ కమిటీలు ఏర్పాటు మరియు ప్రతి వంద ఓటర్లు నుంచి ఒక పసుపు దళ కోఆర్డినేటర్ ఎంపిక చేసి పార్టీ గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా తయారు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగనున్నారు.