పోతవరం గ్రామాన్ని పొదిలి మున్సిపాలిటీలో చేరుస్తా : కందుల

పోతవరం గ్రామాన్ని పొదిలి మున్సిపాలిటీ పరిధిలో చేరుస్తానని మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే అభివృద్ధి చేస్తున్నాం – ఆశీర్వదించండి అనే నినాదంతో కందుల నారాయణరెడ్డి ప్రారంభించిన పాదయాత్ర పోతవరం చేరుకున్న అనంతరం పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో గ్రామ ప్రజలు పలు సమస్యలను కందుల దృష్టికి తీసుకెళ్లగా ఆయన మాట్లాడుతూ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టానని ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా మరికొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని అలాగే పొదిలి మున్సిపాలిటీ పరిధిలో పోతవరం గ్రామాన్ని పొదిలి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం అందుతుందని ఒక్క అవకాశం ఇస్తే పోతవరం గ్రామాన్ని పొదిలి మున్సిపాలిటీ పరిధిలో చేర్చి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ చెప్పిడి రామలింగయ్య, నిర్మమహేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ సామంతపూడి నాగేశ్వరరావు, మండల తెదేపా నాయకులు తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, షేక్ రసూల్, షేక్ జిలాని, యర్రమూడి వెంకట్రావు, ముని శ్రీనివాస్, బత్తిన ఓబయ్య, జ్యోతిమల్లి, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గొంట్లా సాయి కుమార్, ముల్లా జిందాబాషా, ఆరిక రాము,తెలుగు మహిళా నాయకురాలు షాన్వాజ్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.