బిజెపి బలోపేతంకు శక్తి కేంద్రాలు కీలకపాత్ర వహించాలి: జాతీయ కార్యదర్శి సత్య కుమార్
భారతీయ జనతాపార్టీ బలోపేతానికి శక్తి కేంద్రాలు కీలకపాత్ర వహించాలని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ అన్నారు.
ఆదివారం నాడు స్థానిక సాయి కళ్యాణ మంటపం నందు భారతీయ జనతాపార్టీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంకు ఒంగోలు పార్లమెంట్ జిల్లా కమిటీ అధ్యక్షులు యస్ శ్రీనివాస్ అధ్యక్షతనతో జరిగింది. వందేమాతరం గీతంతో పార్టీ సమావేశాలను ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకులు జాతీయ కార్యదర్శి సత్య కుమార్ హాజరై భారతీయ జనతాపార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశ భద్రత, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించి శక్తి కేంద్రాల విశిష్టత బూత్ స్థాయిలో అనుసరించే వ్యూహం పై బూత్ కమిటీలు ఏర్పాటు మొదలైన అంశాలపై పార్టీ కార్యకర్తలు అవగాహన కల్పించారు.
తొలుత జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ను గజమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీరా కుమారి, శక్తి కేంద్రల జిల్లా ఇన్చార్జ్ శాసనాల సరోజినీ, జిల్లా కార్యదర్శి రావిపాటి అజయ్, పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మాకినేని అమార్ సింహా మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు