ఘనంగా ప్రధాన మంత్రి జన్మదిన వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పొదిలి పట్టణం లో ఘనంగా జరిగాయి.
శని వారం నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 72 వ జన్మదిన సందర్భంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు భారతీయ జనతా పార్టీ పొదిలి మండల అధ్యక్షులు మాకినేని అమర్ సింహా ఆధ్వర్యంలో రోగులకు పాలు, పండ్లు ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ భారత్ ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్రమోడీది అని అన్నారు.
ఆర్టికల్ 370 ,35ఎ రద్దు చేసి కాశ్మీర్ ను పూర్తి స్థాయిలో భారత్ అంతర్భాగంగా చేసిన ఘనత నరేంద్రమోడీ దే అని అన్నారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యం ప్రతి బిజెపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మువ్వాల పార్థసారథి, మాగూలూరి రామయ్య, గుంటూరి సుబ్బాయ్య, శ్రీనివాస్ రెడ్డి, యర్రం వెంకట రెడ్డి, బాల శ్రీను, కారంశెట్టి బ్రదర్స్, బాబు స్టూడియో శ్రీనివాస్ , బుడంగుంట్ల నారాయణ, మరియు ప్రభుత్వ అధికారి డాక్టర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు