పొదిలి లో ర్యాలీ కొనకనమిట్లలో రాస్తారోకో
పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చెయ్యాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొదిలిలో ర్యాలీ,కొనకనమీట్ల లో ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు.
గత ఇరవై రోజుల గా మార్కాపురం పట్టణంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు గా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నాడు పొదిలి పట్టణంలో స్థానిక మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహశీల్దార్ దేవ ప్రసాద్ కు వినతిపత్రాన్ని అందజేశారు.
కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి అనంతరం తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దారుకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పొల్లా నరసింహా యాదవ్, షేక్ రసూల్,సమంతపూడి నాగేశ్వరరావు,మూరబోయిన బాబురావు యాదవ్, మీగడ ఓబుల్ రెడ్డి ముల్లా ఖూద్దుస్, సయ్యద్ ఇమాంసా, జ్యోతి మల్లి,నరసింహారావు,అంకాల రోశయ్య వేంపాటి శ్రీకాంత్ రెడ్డి దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుందురి కాశిరెడ్డి కోటేశ్వరరావు, బరిగే బాలయ్య, ఎ శ్రీనివాస్ ,బాషాపతి కోడె గురవయ్య. జయరామి రెడ్డి మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు