బహిరంగ చర్చకు సిద్ధమా – వైసిపి నాయకులకు సవాల్ విసిరినా : కందుల

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు వెలుగొండ ప్రాజెక్టు పై ఇతర అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి సవాల్ విసిరారు.

పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కార్యకర్తల సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి పొదిలి మండలాన్ని చేర్చటం వైయస్సార్ కాంగ్రెసు ప్రభుత్వం స్ధానిక ప్రజా ప్రతినిధి విఫలమైయ్యరని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి పొదిలి మండలాన్ని చేర్చి ప్రతి అంగుళన్నికి నీరు అందిస్తామని తనకొడుకు కూతురు పై ప్రమాణం చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పార్లమెంట్ కమిటీ నాయకులు షేక్ రసూల్, పండు అనీల్, షేక్ గౌస్ బాషా,సమంతపుడి నాగేశ్వరరావు, మండల నాయకులు మీగడ ఓబుల్ రెడ్డి ముల్లా ఖూద్దుస్ , కొనకనమీట్ల మండల అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ , స్థానిక పార్టీ నాయకులు యస్ ఎం భాషా, సన్నెబోయిన సుబ్బారావు తెలుగు మహిళ నాయకురాలు షేక్ షన్వాజ్ మార్కాపురం నియోజకవర్గం చెందిన వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.