అధిక పనిభారం తగ్గించండి.. పంచాయతీ సెక్రటరీల ఆవేదన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు అధిక పని భారం, అధిక పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు శనివారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్‌ కార్యాలయం నందు ఎంపిడిఒ శోభన బాబు కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు శేషగిరిరావు మాట్లా డుతూ తాము 39 సర్వేలతోపాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీటి ఒత్తిడితో పని భారం ఎక్కువై కార్యదర్శులు ఇబ్బంది పడుతున్నారని సచివాలయానికి వెళ్లిన దగ్గర నుంచి వివిధ రకాల సర్వేలతోనే సాయంత్రం వరకు సరిపోతుందని, గ్రామంలో వివిధ పనులపై వచ్చిన ప్రజలకు పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పన్ను వసూళ్లు, వ్యర్థ్యాల నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ వంటి విధులు నిర్వహిస్తూ, వీటితో బాటు పి4సర్వే, సమావేశాలు నిర్వహిస్తున్నామని దీనివల్ల మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యంతో మరింత ఇబ్బందులు పడుతున్నామని అన్నారు

 

ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు