యాదవులు, కాపులు, వైశ్యలు, బిసిలు దూరం… కారణంగా కందుల పాదయాత్ర ముగింపు సభ విఫలమైందా….!
మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి తలపెట్టిన చంద్రన్నమాట – కందులమాట పాదయాత్ర మంగళవారం నాడు జరిగిన ముగింపు సభ విఫలం అవ్వడానికి నియోజకవర్గంలోని అత్యధిక ఓట్లు కలిగిన తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే యాదవ సమాజక వర్గం మరియు బిసి కులాలతో పాటు వైశ్య మరియు కాపులు దూరంగా ఉండడంతో సభ విఫలమైయిందా అంటే అందుకు అవును అనే పరిస్థితే కనబడుతుంది.
ముగింపు సభ పొదిలిలో నిర్వహించడం రాష్ట్ర కమిషన్ డైరెక్టర్లు, పొదిలి మండలంలోని మాజీ జడ్పీటిసి, మాజీ ఎంపిపిలు, మాజీ సర్పంచులు, యాదవ, వైశ్య, కాపు, బిసికులాలకు చెందిన నాయకులందరు దూరంగా ఉండడంతోనే సభ విఫలమయ్యేందుకు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.
ఈ వర్గాలు కందుల నారాయణరెడ్డి వ్యవహార శైలిలో విసిగి వేసారి అందురు కూడపలుక్కుని సభను విఫలం చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏదేమైనప్పటికి ఎన్నికల సమయం పడుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఈ సామాజికవర్గాల వారు అండగా ఉండడానికి కందుల ఏమైనా చర్యలు తీసుకుంటారా…….. లేక ఈ సామాజిక వర్గాలను దూరం చేసుకుంటారా అనేది తెలియాలంటే కొంత వేచిచూడాల్సిందే.