సత్యాలు కుటుంబాన్ని పరామర్శించిన పొగాకు బోర్డు ఛైర్మన్
పొగాకు బోర్డు ఛైర్మన్ మరియు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకులు యడ్లపాటి రఘునాథ్ బాబు ఇటివల మృతి చెందిన భారతీయ జనతాపార్టీ స్థానిక నాయకులు రావూరి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు.
మంగళవారం నాడు స్థానిక ఆంధ్రాబ్యాంకు రోడ్డు లోని సత్యాలు నివాసంలో ఆయన చిత్రం పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల బిజెపి అధ్యక్షులు మాకినేని అమార్ సింహా , రాష్ట్ర నాయకులు కొత్తరి సుబ్బారావు స్థానిక నాయకులు మువ్వల పార్ధసారధి, చంద్రశేఖర్, ఆర్ యాస్ యస్ ప్రతినిధులు మునగాల వెంకట రమణ కిషోర్, గునుపూడి మధుసూదనరావు మరియు ఆర్య వైశ్య సంఘ నాయకులు, మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు