వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి పొదిలి మండలం చేర్చాలి-నూకసాని బాలాజీ

తెలుగు దేశం పార్టీ ద్వారానే సమగ్ర అభివృద్ధి

పొదిలి మండల సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్తాం

తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ వెల్లడి

 

వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి పొదిలి మండలాన్ని చేర్చి త్రాగు , సాగు నీరు అందించాలని ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే వెలుగొండ ప్రాజెక్టు ను కేంద్ర జలశక్తి పరిధిలోకి చేర్చాలని కోరుతూ మార్కాపురం లో తలపెట్టిన దీక్ష కార్యక్రమానికి వెళ్తు మార్గం మధ్యలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

అనంతరం తెలుగు దేశం పార్టీ నాయకులు మండలంలోని పలు సమస్యలను బాలాజీ దృష్టికి తీసుకొని వచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి చెందుతుందని అన్నారు.

పొదిలి మండలంకు త్రాగు సాగు నీరు అందించేందుకు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల బృందంతో మాట్లాడి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కలసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టించి అధికారంలోకి రాగానే పొదిలి మండలాన్ని సస్యశ్యామలంగా ముందుకు తీసుకొని వెళ్తాం అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్, కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్ పొదిలి మండల అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మండల పార్టీ నాయకులు సామంతపుడి నాగేశ్వరరావు, సన్నేబోయిన సుబ్బారావు, ముని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.