శ్రావణి వెంకటేశ్వర్లు దారి ఎటు వైపు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు చూపు ఎటువైపు వైపు అనే విషయం పై పొదిలి కొనకనమిట్ల మండలాల తీవ్ర చర్చనీయాంశమైంది
2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని అనుచరులు ఒత్తిడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో త్వరలో పొదిలి కొనకనమిట్ల మండలాల్లోని తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది
మార్కాపురం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గిద్దలూరు ఎంఎల్ఏ అన్నా రాంబాబు తో వెలిశెట్టి వెంకటేశ్వర్లు కు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో శ్రావణి చూపు అన్నా వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం
ప్రజా రాజ్యం పార్టీ లో అన్నా రాంబాబు తో కలిసి పనిచేసిన వెలిశెట్టి వెంకటేశ్వర్లు కు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి
త్వరలోనే అనుచరులు తో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.