లోకేష్ యాత్రకు సంఘీభావం పాదయాత్ర

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర నేటికీ 2 వేల కిలోమీటర్ల పూర్తి అయిన సందర్భంగా యువగళం పాదయాత్రకు సంఘీభావం పాదయాత్ర నిర్వహించారు.

మంగళవారం నాడు గొట్లగట్ట నుంచి పాతపాడు వరకు కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో యువగళం సంఘీభావ పాదయాత్రను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు