ఎంఎల్ఏ కుందూరు పర్యటనకు విశేష స్పందన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

అమదలపల్లి గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

బుధవారం నాడు స్థానిక అమదలపల్లి గ్రామం నందు గ్రామ పంచాయతీ సర్పంచ్ చీరుమల్లే శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తలపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

గ్రామంలోని ప్రతి ఇంటికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి వెళ్లి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్ , మాజీ జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ నరసింహారావు,వివిధ మండల శాఖల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు