జనవరి 30న మార్కాపురం తెదేపా అభ్యర్థి ఖరారు చేసే అవకాశం…..
జనవరి 30వ తేదీన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే ఈ నెల 30వ తేదీన మార్కాపురం అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ అధిష్ఠానం యోచిస్తోందని పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్న నేతలు తమదైన శైలిలో వారు వారు పావులు కదుపుతున్నారని…… ఈ రేసులో ప్రస్తుత మంత్రి సిద్దా రాఘవరావు, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యులు అశోక్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి తనయుడు కెపి నాగార్జునరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అధిష్ఠానం చర్చల నిమిత్తం అభ్యర్థి రేసులో ఉన్న వారికి అమరావతి రావాలని అదేశించగా టిక్కెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఇప్పటికే అమరావతి చేరుకున్నట్లు సమాచారం.