చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండించిన తెలుగు దేశం పార్టీ

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇంటి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం పట్ల తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర ఖండించారు.
శనివారం నాడు స్థానిక చింత చెట్టు దగ్గర ఉన్న తెదేపా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా నాయకులు గుండాల గా బారితెగించి దాడుల్లో పాల్పడుతున్నరని మా సహనాన్ని పరీక్షించడం మంచింది కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్ మండల నాయకులు కాటూరి నారాయణ ప్రతాప్, ఆవులురి యలమంద ఎండీ గౌస్ , భూమ సుబ్బాయ్య , తెలుగు యువత నాయకులు కాటూరి శ్రీను, విద్యార్థి విభాగం పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు