ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని తెదేపా డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే స్థానిక టైమ్స్ మీడియా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ మాట్లాడుతూ పురాణాలలో రాక్షస పాలన గురించి విన్నాం కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూస్తుంటే రాక్షస పాలన కనిపిస్తుందని హిట్లర్ మించి నియంత లాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అన్నారు
ఇలాంటి నియంతల పోకడలు కలిగిన వారందరూ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు అని వీరు కూడా అదే విధంగా చరిత్ర కాలగర్భంలో కలిసిపోతారు అని అన్నారు.

ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ నాయకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు