యనమలకు ఘన స్వాగతం పలికిన తెదేపా నాయకులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు తెలుగు దేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆయన పొదిలి మండలం చెందిన నాయకులు ఘన స్వాగతం పలికారు.
తెలుగు దేశం పార్టీ మహానాడుకు స్థలం పరిశీలనా కోసం మంగళవారం నాడు ఒంగోలు వచ్చిన యనమల రామకృష్ణుడు ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పోల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు, తెలుగు యువత నాయకులు ముని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.