చంద్రబాబును కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందించి స్థానిక సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు చేస్తు ప్రజల్లో మమేకం కావాలని మీకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని అన్నారని వారు తెలిపారు.
వీరి వెంట పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, తెలుగు యువత నాయకులు ముని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు