కనకం ను సత్కరించిన తెలుగు దేశం పార్టీ నాయకులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ వెనుకబడిన తరగతుల విభాగం ప్రకాశం సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులైన కనకం వెంకట్రావు యాదవ్ ను పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.
శనివారం నాడు స్థానిక పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నందు జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ స్ధానం సంపాదించుకున్న కనకం వెంకట్రావు యాదవ్ ను సత్కరించిన అనంతరం తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ వెంకట్రావు భవిష్యత్తులో మరిన్ని పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,పొల్లా నరసింహా యాదవ్, షేక్ రసూల్,కాటూరి నారాయణ ప్రతాప్, మీగడ ఓబుల్ రెడ్డి,ముల్లా ఖూద్దుస్, స్వర్ణ ప్రీతం కృష్ణ, షేక్ గౌస్ భాష, జ్యోతి మల్లి, మహ్మద్, కాటూరి శ్రీను, సుబ్బారావు, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు