జె-బ్రాండ్స్ లిక్కర్ మరణాల పాపం రాష్ట్ర ప్రభుత్వానీదే—కందుల
పొదిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలు సహజ మరణాలు అంటూ సభను సైతం తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అయన తప్పు పట్టారు.
మరోవైపు నాణ్యత లేని, కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు పోవడంతో పాటు జనారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని…వీటిని వెంటనే నిషేధించాలనే డిమాండ్ చేశారు.
కల్తీ సారా, నాణ్యత లేని జె బ్రాండ్స్ మద్యం తో మహిళల తాళిబొట్లు తెంపేస్తున్నారని….ఇంత జరుగుతున్నా కమీషన్ల కోసమే రాష్ట్ర సర్కార్ పనిచేస్తుందని అయన తెలియజేసారు.కల్తీ సారా, జె బ్రాండ్స్ పై నిషేధం విధించక పొతే వాడవాడలా యుద్దానికి టిడిపి సిద్దం అవుతుందని హెచ్చరించారు.
ఈ రాష్ట్రంలో వైసిపి నాయకులు మద్యం ఇసుక మాఫియా గా తయారై ప్రజలను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మరియు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సిండికేట్ లకు స్వస్తి పలకాలి హితవు పలికారు.
ఈ విలేకరుల సమావేశంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్ ,పొదిలి మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ ,ఒంగోలు పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్ , టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్ , ఒంగోలు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా ,తెలుగుదేశం నాయకులు సామంతపూడి నాగేశ్వరావు , సయ్యద్ ఇమాంసా ,
దివ్వెల మురళి గారు, షేక్ యాసిన్ , షేక్ మస్తాన్ వలీ , షేక్ మౌలాలి , వీరిశెట్టి సురేష్ , జ్యోతి మల్లికార్జున రావు, ఠాగూర్ నరసింహారావు , మాజీ ఎంపీటీసీ సభ్యులు నరసింహారావు , షేక్ మహమ్మద్ అలీ , కాటూరి శ్రీను, కాటూరి నరేష్ గారు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చలవాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.