ఇద్దరు నూతన మంత్రులు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు రాజ్ భవన్ నందు ప్రమాణస్వీకారం చేశారు.
వివరాల్లోకి వెళితే విజయవాడ రాజ్ భవన్ నందు నూతనంగా మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణల చేత బుధవారంనాడు మధ్యాహ్నం 1:29నిమిషాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్ తదితరులు హాజరయ్యారు.