గిద్దలూరు సీటుపై కన్నేసిన ఉడుముల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాస్ రెడ్డి గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం పై కన్నేసేరని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
పుర్వ కంభం నియోజకవర్గం పరిధిలో ఇటివల పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరువుతు గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం పరిధిలో పూర్వ సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు.
ఎప్పుడూ నియోజకవర్గం దాటి పొనీ ఉడుముల శ్రీనివాసులురెడ్డి హటాత్తుగా తన పూర్వం నియోజకవర్గం కంభం పట్టణంలో కార్యక్రమానికి హాజరుకావడంలో అంతర్యం ఏమిటి అనే విషయం పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఉందని సమాచారం తో తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని కంభం శాసనసభ్యులు గా పని చేసిన అనుభవం తనకు కలిసి వస్తుందని ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఉడుముల అనుచరుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
ఉడుముల శ్రీనివాసులురెడ్డి అడుగులు ఎటూ వైపు అనేది కాలమే నిర్ణయించాలి