కందుల ఆధ్వర్యంలో మాదాలవారిపాలెం లో బాదుడే బాదుడు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

కందుల ఆధ్వర్యంలో మాదాలవారిపాలెం లో బాదుడే బాదుడు

పొదిలి మండలం మాదాల వారి పాలెం గ్రామం నందు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నాడు”” బాదుడే- బాదుడు”” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భం గా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మోసపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాక రకాల పన్నులు ప్రజలపై వేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు అని ఒక చేత్తో ఇస్తూ నాలుగు చేతులతో పన్నులు వేస్తూ ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అన్నారు.

పొదిలి నగర పంచాయతీలో మాదాల వారి పాలెం, నంది పాలెం, కంబాలపాడు పంచాయతీలను విలీనం చేసి ప్రజలకు ఉపాధి హామీ పనులను దూరం చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు పంచాయతీలను పొదిలి నగర పంచాయతీలో విలీనం కాకుండా అడ్డుకుంటామని అందులో భాగంగా తానే కోర్టు లో కేసు కేసు వేయించానని అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు నీళ్లను పొదిలి మండలం లోని అన్ని గ్రామాలకు తీసుకువస్తానని తద్వారా గ్రామాల్లో త్రాగు మరియు సాగు నీరు తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తానని భరోసా ఇచ్చారు.

మార్కాపురం జిల్లా ప్రకటించకుండా దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టారని తద్వారా ఈ ప్రాంత ప్రజలు వేల ఉద్యోగాలు కోల్పోయారని ఆ పాపం వైసీపీ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, పొదిలి మాజీ జెడ్పిటిసి కాటూరి వెంకట నారాయణ బాబు, పొదిలి మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యర్రం రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాష, పొదిలి పట్టణ ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీనివాసులు, పొదిలి మండలం యూత్ అధ్యక్షులు పోపూరి నరేష్ బాబు, సమన్వయ కమిటీ సభ్యులు ఎస్ ఎం భాష, జిల్లా లీగల్ సెల్ ప్రతినిధి షేక్ షబ్బీర్, జిల్లా తెలుగు యువత దామిరెడ్డి అంజి రెడ్డి , మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ, కొండాయపాలెం సర్పంచ్ సన్నే బోయిన సుబ్బారావు, తెలుగుదేశం నాయకులు షేక్ షహీద్,షేక్ యాసిన్, షేక్ మౌలాలి, జ్యోతి మల్లికార్జునరావు, ఠాగూర్ నరసింహారావు, తలమల్ల వెంకట్రావ్, పాశం నరసింహారావు, జువ్వలేరు అంజిరెడ్డి, సలక నూతల ఆదినారాయణ గ్రామ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.