మర్రిపుడి మండల పరిషత్ అధ్యక్షులుగా వాకా ఏకగ్రీవం ఎన్నిక
మర్రిపుడి మండల పరిషత్ అధ్యక్షులుగా వాకా వెంకట రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శుక్రవారం నాడు స్థానిక మర్రిపుడి మండల పరిషత్ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు వాకా వెంకట రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తొలుత పొదిలి పట్టణం విశ్వనాథపురం ఆంజనేయ స్వామి గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ ర్యాలీగా మర్రిపుడి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వరకు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు