వైయస్సార్ కాంగ్రెసు సేవాదళ్ అధ్యక్షులు గా వర్షం ఫిరోజ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ‌పొదిలి మున్సిపల్ కమిటీ అధ్యక్షులు గా షేక్ ఫిరోజ్ ను ఎన్నుకున్నాట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యువజన విభాగం పొదిలి మండల అధ్యక్షులు గా గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఫిరోజ్ కు మరో సారి పదవి లభించుటం పట్ల ఫిరోజ్ అనుచరులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేశారు.

తనపై నమ్మకం తో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందకు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తనకు పదవి లభించుటకు కారణమైన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు