ఇస్లాం బ్యాంకు ఎక్కడ ముఖ్యమంత్రి ? తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో నందు ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని ప్రస్తుతం ఇస్లాం బ్యాంకు ఎక్కడ ఉందో చెప్పాలని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్ చేశారు.
స్థానిక పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలతో సహా అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేసిందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్ మాజీ జెడ్పిటిసి కాటూరి నారాయణ బాబు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి సామంతపూడి నాగేశ్వరరావు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా జిల్లా మైనారిటీ నాయకులు షేక్ యాసిన్ మహబూబ్బాషా షాహిద్ బిచ్చు బాబు మొహమ్మద్ గౌస్ డాక్టర్ ఇమాంస షేక్ మస్తాన్ వలి ఖల్నాయక్ ముల్లా షబ్బీర్ భాష జిలాని ఖాసిం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి షేక్ షబ్బీర్ బుజ్జిగా గౌస్ కాటూరి శ్రీనివాసులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు