పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించండి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయు నియోజకవర్గం నుంచి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల కరపత్రాలను ఆవిష్కరించారు.

శుక్రవారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు పిడిఎఫ్ ఏర్పాటు చేసిన సమావేశంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బాబురెడ్డి పొక్కిరెడ్డి యొక్క ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు విచక్షణతో ఆలోచన చేసి పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపునకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, సిపిఐ మండల కార్యదర్శి కె వి రత్నం యుటియఫ్ నాయకులు కార్మిక సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు