నూర్జహాన్ ను ఘనంగా సన్మానించిన మహిళలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పొదిలి మున్సిపల్ కమిటీ అధ్యక్షులు షేక్ నూర్జహాన్ ను మహిళలు ఘనంగా సత్కరించారు.

సోమవారం నాడు స్థానిక ప్రకాశ్ నగర్, ఇస్లాంపేట చెందిన మహిళా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూర్జహాన్ కు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు

అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ ను కోసి మహిళాలకు పంచి పెట్టారు.

ఈ సందర్భంగా స్ధానిక మహిళాలు మాట్లాడుతూ ముస్లిం మహిళాకు పార్టీ అధ్యక్ష పదవి అవకాశం కల్పించాటం పట్ల హర్షం వ్యక్తంచేశారు.