యాదవ నాయకులతో మంత్రి లోకేష్ భేటికి గల కారణాలు ఏమిటి?
మార్కాపురం నియోజకవర్గ యాదవ నాయకులతో పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేష్ భేటి అవడం నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే మార్కాపురం నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గ ఓటర్లే అత్యధికం……. అయితే పలు సమస్యలపై యాదవ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఈ మధ్య పోరాటాలకు దిగారు……. ఇదిలా ఉండగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన యాదవ మహాసభ జిల్లా ముఖ్య నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్ ల నాయకత్వంలో ప్రతినిధుల బృందంతో 4రోజుల క్రితం నారా లోకేష్ ప్రత్యేకంగా భేటి అయ్యి నియోజకవర్గ పరిస్థితులు అడిగి తెలుసుకుని….యాదవ సామాజిక వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని…… పార్టీకి సహకరించమని తెలిపి నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా బిసి అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే గెలుపు సాధ్యమా అని అడిగినట్లు సమాచారం. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్ యాదవులను చిన్నచూపు చూస్తున్నారని యాదవ మహాసభ నాయకులు పలుసార్లు ఆయన తీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో తిరిగి అతనికి టికెట్ కేటాయిస్తే ఏ పార్టీ బిసిలకు టికెట్ ఇస్తే ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని లేకపోతే సొంతగా బరిలో నిలవాలని యాదవ మహాసభ నాయకులు భావిస్తున్న తరుణంలో యాదవ మహాసభ నాయకులతో లోకేష్ భేటిపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.