వైకాపా ప్రభుత్వం అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని పిలుపునిచ్చిన : కందుల

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కార్యకర్తలకు మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం స్థానిక విశ్వనాథపురంలోని ప్రైవేటు కళ్యాణ మంటపం నందు తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు రాజధానులు పేరుతో ప్రాంతంల మధ్య చిచ్చు పెట్టి వారు ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇంటి నివేశన స్థలాలు పంపిణీ లో అక్రమాలు, సంక్షేమ పథకాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

గ్రామ,వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అదే విధంగా జనవరి మొదటి వారం నుంచి గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం 18 నెల నెలల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోయిరని త్వరలోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కృషి రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన గునుపూడి భాస్కర్ ను ఘనంగా సత్కరించారు

                      ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్ చప్పిడి రామలింగయ్య, తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాటూరి వెంకట నారాయణ ప్రతాప్ ,షేక్ రసూల్, ముల్లా ఖూద్దుస్, భూమ సుబ్బాయ్య, ఎండీ గౌస్, యస్ ఎం భాషా, సమతంపూడి నాగేశ్వరరావు, సయ్యద్ ఇమాంసా, పోల్లా నరసింహ యాదవ్ ,మూరబోయిన బాబురావు యాదవ్, మహిళా నాయకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు