వైసీపీలోకి దగ్గుబాటి……

జిల్లాలో దగ్గుబాటి కుటుంబం అంటే తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు…… ప్రకాశం జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు అందరికి తెలిసే ఉంటుంది….. ఆయన మరియు ఆయన కుమారుడు హితేష్ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది…. ఇటీవల ప్రజలు హితేష్ వైసీపీ తరుపున పోటీ చేయనున్నారు అనే వాదనలు వినిపించినా స్పష్టత లేక కొంత సందిగ్ధంలో పడ్డారు….. ఇప్పుడు జగన్ మరియు దగ్గుబాటి కుటుంబ భేటీతో అది నిజమైంది….. దగ్గుబాటి కుటుంబం మంచి రోజు చూసుకుని కార్యకర్తల సమక్షంలో వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం…… అయితే ఇక్కడ మరో ట్విస్ట్ …… దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ పార్టీలో చేరితే….. బిజెపి రాష్ట్ర మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న పురంధేశ్వరి బిజెపిలో ఉంటుందా వైసీపీలో చేరనుందా అని కనుక్కునే పనిలో రాజకీయ విశ్లేషకులు తలమునకలైఉన్నారు…. ఏది ఏమైనా దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరడం ఖాయం…… అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వేడి మొదలైందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రముఖులు అందరూ జిల్లా రాష్ట్ర నాయకులు వైసీపీలో చేరడంతో పార్టీకి ఒకింత బలం చేకూరింది.