ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే గురువారం నాడు వైయస్సార్ జయంతి వేడుకల్లో భాగంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద కంభాలపాడు గ్రామ మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ సంయుక్త కార్యదర్శి షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో విశ్వనాథపురం లోని వైయస్సార్ విగ్రహానికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పూలమాలలు వేసారు
అనంతరం అక్కడ పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద బస్టాండ్ లో ఉన్న వైయస్సార్ విగ్రహానికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
చిన్న బస్టాండ్ నందు ఆర్ఎంపీ వైద్యులు యర్రం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
వివిధ ప్రాంతాల గ్రామాల్లో వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వివిధ కార్యక్రమాల్లో వైకాపా నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, జి శ్రీనివాసులు కల్లం వెంకట సుబ్బారెడ్డి , గుజ్జులా రమణారెడ్డి, కె వి రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి కొత్తపులి బ్రహ్మ రెడ్డి , షేక్ నూర్జహాన్ షేక్ రబ్బానీ ,షేక్ గౌస్ బాషా షేక్ మహబూబ్ బాషా,పెమ్మని ఓంకార్ యాదవ్, పులగోర్ల వెంకట్రావు యాదవ్ పిచ్చిరెడ్డి , మందగిరి రమేష్ యాదవ్ , వర్షం ఫిరోజ్, హనిమూన్ శ్రీనివాస్ రెడ్డి,చోటా ఖాసిం, కోగర వెంకట్రావు యాదవ్, రోటీ యస్ధాన్, తదితరులు పాల్గొన్నారు