నూర్జహాన్ ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి వేడుకలు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి తొలిత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి షేక్ రబ్బానీ, చోటా ఖాసిం, కోగర వెంకట్రావు యాదవ్, రోటీ యస్ధాన్, వర్షం ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.