వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా…?

పొదిలి మండలంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనేది కొందరు కార్యకర్తల మాట…..ప్రస్తుతం మండలంలో ముందుండి నడిపించే నాయకుడు లేడని 3నెలలలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే ప్రజలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉండగా అసలు కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడే లేడని కార్యకర్తలు మదనపడుతున్నారని….. మాజీ ఎమ్మెల్యే కుమారుడు వైసిపి యువ నాయకుడు అయిన సానికొమ్ము శ్రీనివాసరెడ్డి ఇదివరకు ఎల్లప్పుడూ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుండి ఎంతో చురుకుగా నడిపిస్తుండగా ప్రస్తుతం ఆయన బెంగుళూరులో ఉండడంతో ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో నడిపించే యువ నాయకుడు దూరంగా ఉండడంతో ఆయనతో సన్నిహితంగా ఉండే పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారని…… ఏది ఏమైనా సమయం దగ్గర పడుతుంది కదా ఈ సమయంలో సమన్వయం లోపిస్తే మండలంలో వైసీపీ ఓటుబ్యాంకును భారీగా నష్టపోయే అవకాశం ఉన్నందున కార్యకర్తలను, నాయకులను చైతన్య పరచడానికి మండలంలో పార్టీని పటిష్టపరిచేందుకు అందుబాటులో ఉంటూ ముందుండి నడిపించే నాయకుడు అవసరం ఉందని పలువురు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.