ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో బంగారుపతకం సాధించిన తెలుగుతేజం
స్విడ్జర్లాండ్ లోని బ్రెసిల్ లో జరిగిన బి డబ్ల్యూ ఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తెలుగుతేజం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బంగారుపతకం సాధించి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2017లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన సింధు నేడు బ్రెసిల్ లో జరిగిన బి డబ్ల్యూ ఎఫ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో ఓటమికి అవకాశం లేకుండా ధీటైన ఆటతో జపాన్ క్రీడాకారిణి నజామి ఒకుహరపై రెండు సెట్లలో 21/7, 21/7గా పాయింట్లతో ఓ స్థాయిలో దూసుకుపోయిన పివి సింధు ధాటికి ఒకుహర ఓటమిపాలవ్వక తప్పలేదు…. అయితే ప్రపంచ బ్యాడ్మింటన్ షిప్ లో భారత్ కు బంగారు పతకం సాధించిన తొలిమహిళగా పివి సింధుకు విశ్వవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.