ఇండియన్ క్రికెటర్స్ లో ధోనీనే బెస్ట్ ప్లేయర్: కపిల్ దేవ్
ఇండియన్ క్రికెట్ తో పాటు వరల్డ్ క్రికెట్ హిస్టరీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీది ఓ ప్రత్యేక స్థానం. భారత్ కు 2011 వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ అందించిన ఈ మిస్టర్ కూల్ పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. యంగ్ క్రికెటర్లకు టెస్ట్ టీంలో చోటు దక్కాలనే ఉద్దేశ్యంతోనే ధోనీ ఆ ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడని.. అలా ఆలోచించడం ధోనీ గొప్పతనమని కపిల్ అన్నారు. ఇండియన్ క్రికెటర్స్ లో ధోనినే బెస్ట్ ప్లేయర్ అని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ లో ధోనీ ఆడాలని తాను కోరుకుంటున్నట్లు కపిల్ దేవ్ చెప్పారు. టెస్ట్ లకు రిటైర్ మెంట్ ప్రకటించిన ధోనీ వన్డే,టీ 20 ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు.