పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల వద్ద ఉన్న మొత్తం కందులు కొనుగోలు చేయాలి – ఎంపి వైవి
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మరియు రైతుల వద్ద ఉన్న మొత్తం కందులు కొనుగోలు చేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు సోమవారం ఉదయం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వారియొక్క గోడు విని అధికారులతో మాట్లాడి తక్షణమే గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం దళారుల కంటే హీనంగా ప్రవర్తిస్తుందని ప్రభుత్వాన్ని నమ్మి కందులు అమ్మకాలు జరిపితే నేటికి సుమారు 175 కోట్లకు పైగా రైతులకు డబ్బు చెల్లించాల్సి ఉంది అన్నారు. తక్షణమే రైతులకు చెల్లించవలసిన డబ్బు చెల్లించి రైతు వద్ద ఉన్న మొత్తం కందులను కొనుగోలు చేయలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి, వైసీపీ సమన్వయకర్త వెన్న హనమారెడ్డి, షంషీర్ అలీ , స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.