మహిళా దినోత్సవం సందర్భంగా 3కె రన్ , ముగ్గుల పోటీలు, ఉచితంగా బీమ్ల నాయక్ ప్రదర్శన
మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు స్థానిక మార్కాపురం క్రాస్ వద్ద 3కె రన్ ను పొదిలి సిఐ సుధాకర్ రావు లాంచనంగా ప్రారంభించి మార్కాపురం క్రాస్ రోడ్ నుండి చిన్న బస్టాండ్ వరకు నిర్వహించగా స్థానిక బెల్లంకొండ విద్యా సంస్థ చెందిన విద్యార్థులకు ఉచితంగా బీమ్ల నాయక్ సినిమా ప్రదర్శించారు.
అదే విధంగా స్థానిక మండల పరిషత్ ప్రాంగణం నంద ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3k రన్ నిర్వహించడం జరిగిందని రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ వారి అభ్యున్నతికి సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయని, ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్ లో తప్పనిసరిగా దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు. దిశ యాప్ ఇన్స్టాల్ చేసిన మహిళలకు టెన్ పర్సెంట్ రాయితీతో కూడిన కొనుగోలు మహిళా దినోత్సవం రోజు చేయవచ్చని పొదిలి లో రాయితి గల షాపులు ఉదయ్ ఫ్యాషన్స్ రిలయన్స్ డిజిటల్ మాల్ చందన షాపింగ్ మాల్ దుకాణాలలో 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి కొనకనమిట్ల సబ్ ఇన్స్పెక్టర్ ఫణి భూషణ్, తాడివారి పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ముక్కంటి మరియు మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు