రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి కొనకనమిట్ల మండలాల సరిహద్దు లో రోడ్డు ప్రమాదం 9 మందికి గాయాలు దొనకొండ క్రాస్ రోడ్ పొదిలి – కొనకనమిట్ల మండలాల సరిహద్దు సమీపంలో ఆటో బస్సు ఢీ కొట్టడంతో ఆటో ప్రయాణం చేస్తున్న 9 మంది గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలం కంభాలపాడు గ్రామానికి చెందిన కొప్పుల కృష్ణవేణి కి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిమిత్తము మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా దొనకొండ క్రాస్ రోడ్ సమీపంలోని కొనకనమిట్ల – పొదిలి మండల సరిహద్దులో బస్సు ఆటో ఢీకొట్టిన సంఘటన లో ఆటో ప్రయాణం చేస్తున్న కంభాలపాడు గ్రామానికి చెందిన బాలమ్మ, చిన్న నరసమ్మ, చిన్న బాల గురవమ్మ, రమణమ్మ,శివ కుమారి, శేఖర్, వెంకట్రావు, ఒక చిన్నారి గాయపడ్డారు.

గాయపడిన వారిని 108 వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ఒంగోలుకు తరలించగా మీగత వారిని ఒంగోలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రమాదం కు కారణమైన మార్కాపురం ఆర్టీసీ బస్సును పొదిలి పోలీసు స్టేషన్ నందు నిలిపి డ్రైవర్ లొంగిపోయినట్లు సమాచారం

సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది