నేడు 29కోవిడ్ కేసులు నమోదు…. విలేఖరులకూ కరోనా తాకిడి
పట్టణంలో నేడు 29కోవిడ్ కేసులు నమోదు కాగా కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న ముగ్గురు విలేఖరులు సైతం కరోనా తాకిడికి గురయ్యారు.
వివరాల్లోకి వెళితే మంగళవారంనాడు కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలలో 2కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒంగోలు కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ నందు 27కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
నేడు నమోదయిన 29పాజిటివ్ కేసులతో కలుపుకుని పట్టణంలో మొత్తం ఇప్పటివరకు 617కోవిడ్ పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి.