తూమాటి ఆధ్వర్యంలో ఎడ్ల బల ప్రదర్శన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గుండ్లసముద్రం గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తూమాటి వెంకట నరసింహారెడ్డి సౌజన్యంతో మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల లో భాగంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, కొండేపి సిఐ శ్రీనివాసరావు, మర్రిపూడి యస్ఐ అంకమ్మ రావు మాజీ ఎంపిటిసి సభ్యులు ఆవుల కృష్ణారెడ్డి యవ పారిశ్రామిక వేత్తలు ఆవుల సంజీవరెడ్డి, న్యాయ నిర్ణీతలు వాకా సుబ్బారెడ్డి, మరియు పొదిలి,మర్రిపూడి మండలాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు మరియు ప్రజలు వేలాది మంది తరలివచ్చారు