రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:
పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇరువురు గాయపడిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.
స్థానికుల కథనం మేరకు ఉప్పలపాడు ఏలూరు క్రాస్ రోడ్ సమీపంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వాహనం టిప్పర్ ఢీకొనడంతో సబ్ కలెక్టర్ వాహనంలో ప్రయాణం చేస్తున్న డ్రైవర్ అటెండర్ తీవ్రగాయాలు కాగా సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.

క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఒంగోలు చికిత్స పొందుతున్న సబ్ కలెక్టర్ సేతు మాధవన్ ను మరియు ఇతర సిబ్బందిని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరామర్శించారు