రోడ్డుప్రమాదంలో మహిళా మృతి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఒంగోలు – నంద్యాల జాతీయ రహదారి పై పొదిలి మండలం కంభాలపాడు -చిన్న అరికట్ల మధ్యలో శనివారం నాడు రోడ్డుప్రమాదం సంభవించింది.
దరిశి పట్టణం శివాజీ నగర్ చెందిన బండారి నరసమ్మ, వెన్నుపూస రాములమ్మ, కత్తి రమణ, బొమ్మ బాలకృష్ణ లు రెండు ద్విచక్ర వాహనాలపై కనిగిరి వెళ్ళే క్రమంలో పొదిలి మండలం కంభాలపాడు -చిన్న అరికట్ల మధ్యలో వర్షం రావటంతో చెట్లు కింద్ర ద్విచక్రవాహనాలు అపి నిల్చున్న క్రమంలో బొలెరో వాహనం ఢీకొట్టడంతో బండారి నరసమ్మ 60 అక్కడికి అక్కడే మృతి చెందగా మీగత ముగ్గురు స్వల్పంగా గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ కోమర మల్లిఖార్జునరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు