ఫైబర్ ఆప్టిక్, బ్రాండ్ బ్యాండ్ టెక్నీషియన్ ఉచిత కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సౌజన్యంతో దిన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద వృత్తి నైపుణ్యం శిక్షణ కార్యక్రమాన్ని పొదిలి పట్టణం ఒంగోలు రోడ్ లోని సెయింట్ మేరిస్ గ్రూప్ ఇనిస్టిట్యూషన్స్ నందు జోసఫ్ శ్రీ హర్ష & మేరి ఇంద్రజ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు.
కోర్సు వివరాలు బ్రాండ్ బ్యాండ్ టెక్నీషియన్, 3.5 నెలలు, ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్, 3 నెలలు, లాజిస్టిక్స్ క్లెర్కె & సూపర్ వైజర్, 3 నెలలు కోర్సులకు 25వ తేదీ నుంచి అడ్మిషన్లు జరుగుతాయని 10వ తరగతి ఆ పై విద్యార్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెయింట్ మేరిస్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ కో ఆర్డినేటర్ షేక్ భాషా తెలిపారు