రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుల గణన నిర్వహించాలి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బోట్ల రామారావు డిమాండ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం అని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బోట్ల రామారావు యాదవ్ అన్నారు

దేశంలో బీసీల జనాభా 70 ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. దేశంలో బీసీల జనాభా 70 కోట్లు, మొత్తం జనాభాలో ఇది 56% అని అంచనా. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి.

కులాల లెక్కల తోనే బీసీల అసలు జనాభా తెలుస్తుంది.  కులగణన చేపట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా..అందులో దళితులు, ఆదివాసీల సంఖ్య పైన మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు.

అయితే జనాభాలో ఓబీసీ తో పాటు ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. జనాభాలో ఇది 56% అని అంచనా. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి. కులాల లెక్కల తోనే బీసీల అసలు జనాభా తెలుస్తుంది. కులగణన చేపట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా..అందులో దళితులు, ఆదివాసీల సంఖ్య పైన మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు.

అయితే జనాభాలో ఓబీసీ తో పాటు ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదని అన్నారు.

అఖిల భారత యాదవ మహాసభ గ్రామ అభ్యుదయ సమితి ఏర్పాటులో భాగంగా ఆదివారం నాడు స్థానిక పొదిలి మండల రాములవీడు గ్రామానికి రాష్ట్ర అధ్యక్షులు బోట్ల రామారావు యాదవ్ హాజరై గ్రామ కమిటీల ఎంపిక లో పాల్గొని దిశ నిర్దేశం చేశారు.

యేటి ప్రసాద్, యేటి ఏడుకొండలు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బోట్ల రామారావు ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మందగిరి వెంకటేష్ యాదవ్ మూరబోయిన బాబురావు యాదవ్, సర్పంచ్  చిరుమల్లే శ్రీనివాస్ యాదవ్,మస్తాన్ రావు యాదవ్, చిట్టిబోయిన విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు