అఖిల భారత స్కూల్ క్విజ్ పోటీలు ప్రారంభం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

భారతీయ రిజర్వు బ్యాంకు ఆంధ్రప్రదేశ్ శాఖ సౌజన్యంతో బ్యాంకు అఫ్ బరోడా ఆధ్వర్యంలో అఖిల భారత స్కూల్ క్విజ్ పోటీలు నిర్వహించారు.

బుధవారం నాడు స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు
ఈ సందర్భంగా బ్యాంకు అఫ్ బరోడా మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని అదే విధంగా జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు రాష్ట్ర స్థాయిల్లో ఎంపికైన వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని అన్నారు

ఈ కార్యక్రమంలో బ్యాంకు అఫ్ బరోడా మేనేజర్ నాగరాజు, బ్రహ్మయ్య, శివరాత్రి శ్రీనివాస్, మోహన్ రెడ్డి,సుబ్బయ్య, సిఆర్పి కుమార్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు