బిసి జాబితా లో కాపులను చేర్చుటకు నిరసన గా రాస్తారోకో
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బిసి జాబితా లో కాపులను చేర్చుటకు నిరసనగా బిసి సంక్షేమ సంఘం ఆద్వర్యం లో పొదిలి విశ్వనాథపురం ఒంగోలు-కర్నూలు రోడ్డు పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు భారీ వాహనాల రాకపోకలు నిలిచి పొయ్యి ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి నవీన్ కృష్ణ మాట్లాడుతూ కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ తీర్మానం చేసి బిసి ల కడుపు కొట్టారని తక్షణమే తెలుగు దేశం ప్రభుత్వం శాసన సభ తీర్మానం రద్దు చేయకపోతే బిసి ల పునాదుల పై నిర్మితమైన తెలుగు దేశం పార్టీ ని రాబోయే ఎన్నికల లో భూస్తాపితం చేస్తామని అన్నరు. బిసిసేన రాష్ట్ర అధ్యక్షులు మదు మాట్లాడుతూ మాంజునాధ్ కమిటీ నివేదిక ఇవ్వకుండా రాత్రి రాత్రి కి కేబినెట్ తీర్మానం చేసి ఉదయం శాసనసభలో తీర్మానం తెలిపి బిసిలకు చంద్రబాబు ద్రోహం చేసరాని అన్నారు. బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంకా చిరంజీవి మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం చేసిన ద్రోహంనికి నిరసన గా పెద్ద ఎత్తున ఉద్యమం లు చేసి తెలుగు దేశం ప్రభుత్వం ని పునాదు తో సహా పేకిలి వేస్తామని అన్నరు బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు డబ్బుకోట్టు కళ్యాణ్ మాట్లాడుతూ బిసి శాసన సభ సభ్యులు మంత్రులు తక్షణమే రాజీనామా చేయలని డిమాండ్ చేసారు. రాస్తారోకో తో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి పోవడంతో పొదిలి యస్ ఐ సుబ్బారావు వచ్చి రాస్తారోకో విరమణ చేయించి వాహనాల రాకపోకలు ను క్రమబద్దికరణ చేసారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు పాశం వెంకటేశ్వర్లు ఉల్లిపాయల మురళి కృష్ణ వెంకటేష్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.