పొదిలి తహశీల్దారుగా సుజాత నియామకం

పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారుగా జి సుజాతను నియమిస్తూ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

ప్రస్తుతం పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారుగా పనిచేస్తున్న జె ప్రభాకరరావును కొండేపికి బదిలీ చేస్తూ సోమవారంనాడు ఉత్తర్వులు జారీచేశారు.

కొండేపిలో పనిచేస్తున్న జి సుజాతను పంగులూరు మండల రెవిన్యూ తహశీల్దారుగా సోమవారంనాడు బదిలీ చేసిన అధికారులు మంగళవారంనాడు ఆ ఉత్తర్వులను రద్దు చేసి పొదిలికి బదిలీ చేస్తూ మంగళవారంనాడు మరో ఉత్తర్వును జారీచేశారు.