సంచలనం సృష్టించినా కిడ్నాప్ హత్య కేసులో పురోగతి ఒక్కరి అరెస్టు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
విశాఖపట్నంలో కిడ్నాప్ చేసి తాడివారిపల్లి చెక్ పోస్ట్ మధ్య నుండి గొట్లగట్టు మధ్యలోని నడి కనుమ వద్ద హత్య గురైన బత్తుల దేవ ధరణి మృతదేహాన్ని గుర్తించి పంచనామా పూర్తి చేసి కేసు నమోదు చేసి పొదిలి సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.
బుధవారం నాడు స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దరిశి డియస్పి నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ అరసాడ హరి కృష్ణ మధురవాడ, విశాఖపట్నం, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, టౌన్ PS, విశాఖపట్నం నగరం వారు ఇచ్చిన ఫిర్యాదుపై పెద్ద యమ్మనూరు గ్రామం, ఉయ్యాలవాడ మండలం, నంద్యాల జిల్లాకు చెందిన నిందితులు ఎ.1 రాగిరి ప్రవీణ్ కుమార్, 26 సంవత్సరాలు, కులం ఏరుకల, అహోబిలం, ఆళ్లగడ్డ, నంద్యాల.. ఎ.2 మనోజ్. ఎ.3 నరేష్ @ సురేష్, ఎ.4 రాగిరి చాణక్య, కులం యెరుకల, అహోబిలం, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, A s/o లక్ష్మి కోటయ్య, 21 సంవత్సరాలు, కులాల వారీగా బలిజ, చిత్రేనిపల్లి, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా. ఎ.5 స్వప్న, అహోబిలం, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా అను వారిపై కేసు నమోదు చేసి పొదిలి సిఐ సుధాకర్ రావు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతుని అన్న కు ఇద్దరు తమ్ముళ్లు కలిగి ఉండి మొదటి తమ్ముడు బత్తుల వెంకటసుబ్బయ్య తన తల్లిదండ్రులకు వ్యవసాయం పనులలో సహాయంగా ఉంటూ చిన్న తమ్ముడు/ మృతుడు బత్తుల దేవదరనీ చిన్నప్పటినుండి చెడు వ్యసనాలకు బానిసై ఆడవారితో ఎక్కువగా ఫోన్లు చేసి మాట్లాడడం చేస్తూ ఉండగా మృతుని అన్న పవన్ సాయి తన చిన్న తమ్ముడిని తన వద్ద అనగా విశాఖపట్నంలో తనకు గల రెస్టారెంట్ నందు పనికి కుదిర్చి ఇంటర్ చదివించి నప్పటికీ చదువుకొక ఇంటర్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపివేసి అమ్మాయిలతో ఫోర్షే చాటింగ్ చేస్తూ గంగ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోగా సద్గురు గంగా అనే అమ్మాయి ముద్దాయిలలో
ఒకడైన ప్రవీణ్ కుమార్ తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వలన సదరు ప్రవీణ్ కుమార్ మృతుడైన దేవధరనికి మధ్య గొడవలు జరుగగా, అన్న పవన్ సాయి సర్దుబాటు చేసినాడు కానీ మృతుడు గంగతో పరిచయం ఆపుదల చేయకుండా కొనసాగిస్తూ ఉండేసరికి గంగతో పరిచయం (అక్రమ సంబంధం) ఉన్న ప్రవీణ్ కుమార్ పథకం ప్రకారం మృతుడిని విశాఖపట్నం నుండి ఒక బాడుగ కారులో మనోజ్, దాణక్య, మా సరే స్వప్న అనే అమ్మాయితో మాయ మాటలు మృతునితో మాట్లాడించి నమ్మబలికించి మృతుడును కారు ఎక్కేలా చేసే కారు ఎక్కిన మృతుని క్లోరో ప్లాన్ నోట్లో ఏసి అహోబిలం పోతూ మార్గమధ్యమంలో మృతుడు క్లోరోఫామ్ వలన మలమూత్రములు: విసర్జించుడు దున్నప్పటికీ, ముద్దాయిలు ముందుగానే తెచ్చుకున్న కత్తితో ఒంగోలు నుండి నంద్యాల పోవు రోడ్డుకు మధ్యలో తాడువారిపల్లి ఘాట్ రోడ్డులో కారు ఆపి మృతుని కిందకు దించి కొండ ప్రాంతంలో కత్తితో మెడ కోసి చంపి ముందుగా తెచ్చుకున్న పెట్రోల్ మూడు సీసాలను మృతునిపై పోసి కాల్చి చంపగా, మృతుడు ది 01/02/2023 నుండి కనిపించపోవుసరికి అతని అన్న పవన్ సాయి ఫిర్యాదు మేరకు విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు మాన్ మిస్సింగ్ గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో – మృతిని చంపడానికి ఉపయోగించిన కారు తోలిన డ్రైవర్ అయిన శివ కిరణ్ ను పట్టుకుని విచారించగా అతను చూయించిన మృతుని శవమును బట్టి విశాఖ నుండి వచ్చిన పోలీస్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సదరు శివకిరణ్ ను అరెస్టు చేయటం అయినది, ఈ కేసులో పాల్గొనిన మరియు మృతున్ని చంపడానికి సహకరించిన అందరిని తదుపరి దర్యాప్తులో అరెస్టు చేయవలసి ఉన్నదని ఆయన అన్నారు. గుర్తు తెలియని వారితో అక్రమ పరిచయాలు పెట్టుకొని వ్యవహరించే వారికి, అవసరం లేని వారితో ఫోన్ లో చాటింగ్ లు ప్రమాదకరమని ఆయన అన్నారు.
ఈ విలేకర్ల సమావేశంలో పొదిలి సిఐ సుధాకర్ రావు, తర్లబాడు యస్ఐ ముక్కంటి, ఎయస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు